logo

యూపీఎస్సీ తరహాలో ఓపీఎస్సీ పరీక్షలు

రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్సీ 1991 చట్టంలో సవరణలు చేసింది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేబినెట్‌ సమావేశం ఏర్పాటైంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌ విలేకరులకు

Published : 01 Oct 2022 01:48 IST

సురేష్‌ మహాపాత్ర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే ఆ వివరా: రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్సీ 1991 చట్టంలో సవరణలు చేసింది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేబినెట్‌ సమావేశం ఏర్పాటైంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌ విలేకరులకులు వెల్లడించారు. ఇదివరకు ఓపీఎస్సీ నిర్వహిస్తూ వచ్చిన ఒడిశా సివిల్‌ సర్వీస్‌ (ఓసీఎస్‌) పరీక్షల మార్కులు 2250గా ఉండేవని, ప్రస్తుతం దీనిని యూపీఎస్సీ మాదిరిగా మార్చిన రాష్ట్ర కేబినెట్‌ మార్కులను 2000గా చేసిందన్నారు. విద్యార్థులు ఆంగ్లం లేదా ఒడియాలో జవాబులు రాయవచ్చని, సాధారణ వర్గాలవారు 6 సార్లు, ఆర్థికంగా వెనుకబడినవారు 9 సార్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లయినా పరీక్షలు రాయవచ్చని వివరించారు. యూపీఎస్సీ మాదిరిగా ఓపీఎస్సీ పరీక్షల్లో ఒకే ఐచ్ఛిక సబ్జెక్టు ఉంటుందని చెప్పారు.

 ధాన్యం సేకరణ లక్ష్యం నిర్ధారణ
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌, రబీ ధాన్యం సేకరణ లక్ష్యం 71 లక్షల మెట్రిక్‌ టన్నులుగా నిర్ణయించినట్లు సురేష్‌ మహాపాత్ర్‌ చెప్పారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ నవంబరు 1 నుంచి మార్చి 31 వరకు, రబీ పంట సేకరణ మే 1 నుంచి జూన్‌ నెలాఖరువరకు చేపడతామని తెలిపారు. రైతులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఓఎంసీ), ఒడిశా మినరల్‌ కార్పొరేషన్‌ విలీనం చేసినట్లు వివరించారు. సచివాలయంలో త్వరలో గ్రూప్‌ ఏలో 120 మంది అధికారుల పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదించినట్లు సీఎస్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని