logo

తగ్గిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. పశ్చిమ ఒడిశా, కొండకోనల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి.

Published : 29 Nov 2022 02:38 IST

సిమిలిగుడ 5.6

దారింగిబాడిలో సోమవారం ఉదయం ఇదీ పరిస్థితి

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. పశ్చిమ ఒడిశా, కొండకోనల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి. సాయంత్రం 4 తరువాత చలిగాలులు వణికిస్తున్నాయి. దీంతో చీకటి పడగానే తలుపులు వేసుకొని అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చాలాచోట్ల ఉదయం, సాయంత్రం మంటలు వేసుకుని చలి కాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ సోమవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడలో అత్యల్ప ఉష్ణోగ్రత 5.6 డిగ్రీలుగా నమోదు కాగా, కొంధమాల్‌లోని పుల్బాణిలో 8.5, ఇదే జిల్లాలోని దారింగిబాడి, కళింగ, బలిగుడల్లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలోని మరో 27 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీలలోపుగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రానికి ఉత్తర భారతం మీదుగా చలిగాలులు నేరుగా తాకుతున్నందున చలి ఇంకా పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతాయని, మంచు ముప్పు కూడా ఉంటుందని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని