‘మహిళలకు రక్షణ కరవు’
రాష్ట్రంలో కాంగ్రెసుకు మంచి రోజులు రానున్నాయని పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ అన్నారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా రాయగడ జిల్లా రామన్నగుడలో శుక్రవారం మధ్యాహ్నం పాదయాత్ర నిర్వహించారు.
రామన్నగుడలో శరత్ పట్నాయక్, ఎంపీ ఉలక తదితరులు
గుణుపురం, నూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెసుకు మంచి రోజులు రానున్నాయని పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ అన్నారు. భారత్ జోడో యాత్రకు మద్దతుగా రాయగడ జిల్లా రామన్నగుడలో శుక్రవారం మధ్యాహ్నం పాదయాత్ర నిర్వహించారు. శరత్ పట్నాయక్‌తోపాటు కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రం అవినీతిమయమైందన్నారు. మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు దుర్గాప్రసాద్ పండా, నాయకులు రఘుపాత్ర్, బిజయ కుమార్ గమాంగ్, రామన్నగుడ సమితి అధ్యక్షులు రవి శంకర గమాంగ్, ఎంపీ ప్రతినిధి ప్రసాదరావు, రాజీవ్ సాహు తదితరులు పాల్గొన్నారు.
రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రం రాయగడలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక, రాయగడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదివాసీ నేత అప్పలస్వామి కడ్రక యాత్రలో పాల్గొన్నారు.
రాయగడలో..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిక తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్
-
India News
Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
-
Politics News
Anam: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Shubman Gill: నేను సెలక్టర్నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్
-
India News
Amritpal Singh: ‘అమృత్పాల్ పోలీసులకు లొంగిపో’.. అకాల్తక్త్ పిలుపు