logo

బాలిక అపహరణ: ఆంధ్రలో కాపాడిన పోలీసులు

స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక (17)కు ఇటీవల బ్రహ్మపుర రైల్వే స్టేషన్‌లో నగరానికి చెందిన ఓ యువకుడు (35) మాయమాటలతో నమ్మించి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చాడు.

Published : 21 Mar 2023 03:16 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక (17)కు ఇటీవల బ్రహ్మపుర రైల్వే స్టేషన్‌లో నగరానికి చెందిన ఓ యువకుడు (35) మాయమాటలతో నమ్మించి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చాడు. అనంతరం బాలికతో సింహాచలం (ఆంధ్ర)లోని ఓ లాడ్జికి చేరుకున్నాడు. మెలకువ వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు ఫోను ద్వారా విషయాన్ని తెలియజేసింది. పెద్దబజారు ఠాణా పోలీసులు ఆంధ్ర పోలీసుల సహకారంతో ఆమెను కాపాడి, యువకుడ్ని పట్టుకొని నగరానికి తీసుకువచ్చారు. ఇద్దరినీ వైద్య పరీక్షల అనంతరం శనివారం యువకుడ్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు.

* కొంధమాల్‌ జిల్లా కోటగఢ్‌ ఠాణా పరిధిలో మాదాగుడ పంచాయతీలోని హరిపూర్‌ బుడా కొండ ప్రాంతంలో గాలిస్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు అనుమానంతో ఆదివారం 11 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి నాలుగు దేశీ తయారీ తుపాకీలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.  వారు మావోయిస్టులా? లేదా సమీపంలోని గ్రామస్థులా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* బ్రహ్మపుర కొత్తబస్టాండులో ఓ గర్భిణి (30)ను భర్త వదిలి వెళ్లిపోయినట్లు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి నగరంలోని ఒన్‌స్టాప్‌ సెంటర్‌ (సఖి) నిర్వాహకులను అప్రమత్తం చేసింది. కేంద్రం నిర్వాహకురాలు మహేశ్వేత పాఢి హుటాహుటిన కొత్తబస్టాండుకు చేరుకున్నారు. గర్భిణిని ఆదుకొని వివరాలు సేకరించారు. గజపతి జిల్లాకు చెందిన గర్భిణి స్థానిక లంజిపల్లిలో భర్తలో కలిసి ఉంటోంది. రెండు రోజుల కిందట ఆమెను భర్త బస్టాండులో వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని