logo

ముగిసిన నామినేషన్ల పర్వం...

గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్‌ మండల్‌

Published : 26 Apr 2024 02:19 IST

స్వతంత్ర అభ్యర్థి ప్రీతీలతా పట్నాయక్‌

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్‌ మండల్‌, జోన్‌ మల్లిక్‌, పూర్ణచంద్ర గమాంగ్‌లు రెవెన్యూ ఏడీయం బిరేంద్ర కుమార్‌ దాస్‌కు, పర్లాఖెముండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మనోజ్‌ బోడో నాయక్‌, స్వతంత్ర అభ్యర్థులు ప్రీతి లతా పట్నాయక్‌, సంజీవ్‌ కుమార్‌ రౌత్‌, ప్రవేంద్రో సింగ్‌, బిద్యాధర  మహంకుడో నామినేషన్‌ పత్రాలను సబ్‌ కలెక్టర్‌ అనూప్‌ పండాకు అందజేశారు.

నామినేషన్‌ పత్రం అందజేస్తున్న మనోజ్‌


సిమిలిగుడ: పొట్టంగి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సాంబ పంగి గురువారం కొరాపుట్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.


రాయగడ: రాయగడ విధానసభ సీటుకోసం గురువారం సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థి కృష్ణ పలక, స్వతంత్ర అభ్యర్థిగా రంగారావు కొండగిరి గురువారం నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఓ సంఘమిత్ర దేవికి అందజేశారు.


ఆఖరి రోజున దిలీప్‌ నామినేషన్‌

సబ్‌కలెక్టర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న దిలీప్‌

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దిలీప్‌ ప్రధాన్‌ గురువారం సబ్‌కలెక్టర్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ కుమార్‌ నాయక్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.


స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రతీష్‌ పట్నాయక్‌

జయపురం, న్యూస్‌టుడే: జయపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత ప్రతిష్‌ పట్నాయక్‌ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామపత్రాలను సబ్‌కలెక్టర్‌ ప్రభాత్‌ కుమార్‌ పరిడాకు అందజేశారు.


గుణుపురం, న్యూస్‌టుడే: గుణుపురం నియోజకవర్గంలో రెబల్‌ కాంగ్రెస్‌ నాయకులు అవినాష్‌ గమాంగ్‌, భాస్కర జగరంగా, స్వతంత్ర అభ్యర్థులుగా కరుణాకర సబర, నాగభూషణ మండంగిలు నామినేషను పత్రాలను సబ్‌కలెక్టరు, ఎన్నికల అధికారి కిరణ్‌దీప్‌ కౌర్‌ సహొతాకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని