logo

గోపాల్‌పూర్‌లో బిజద బల ప్రదర్శన

గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్‌ రోడ్‌షో దీనికి వేదికైంది గోపాల్‌పూర్‌ సెల్ఫీ పాయింట్‌ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు.

Published : 08 May 2024 01:16 IST

శంఖారావం కళాకారుల విన్యాసం 

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్‌ రోడ్‌షో దీనికి వేదికైంది గోపాల్‌పూర్‌ సెల్ఫీ పాయింట్‌ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభ విజయవంతం కావడంతో దీటుగా నాయకులు ఇక్కడ జన సమీకరణ చేయించారు. శంఖారావం, వాయిద్యాల హోరు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువత నినాదాలతో మెయిన్‌ రోడ్‌ పరిసరాలు మార్మోగాయి.

మహిళల నిరీక్షణ

 పాండ్యన్‌ కార్యక్రమానికి బిజద పెద్దలు సమీప గ్రామాల నుంచి వేలాదిమంది మహిళల్ని వాహనాల్లో తీసుకొచ్చారు. సాయంత్రం 6కి రావాల్సిన ఆయన రాత్రి 9 గంటలకు వచ్చారు. ఆగాగి కురుస్తున్న వానలోనే మహిళలు వేచి చూశారు. అందరికీ ముత్యాలమ్మ శక్తిపీఠం ఆవరణలో భోజనాలు ఏర్పాటు చేశారు.

 మాది 5-టీ గ్యారంటీ

పాండ్యన్‌ మాట్లాడుతూ... గంజాం కలెక్టరుగా గతంలో విధులు నిర్వహించిన తనకు ఈ ప్రాంత ప్రజలంతా కుటుంబసభ్యులన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు తల్లులు, సోదరినులు క్షమించాలన్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఈ జిల్లాతో విడదీయలేని బంధం ఉందని, అందరికీ తోడుగా ఉన్నారని, ఉంటారని చెప్పారు. తమది 5-టీ గ్యారంటీ అని, చెప్పింది చేస్తామని, అభివృద్ధే అజెండా అని తెలిపారు.

ముక్కంటి సన్నిధిలో పూజలు

రాత్రి గోపాల్‌పూర్‌లోని ఒక అతిథి భవనంలో విడిది చేసిన పాండ్యన్‌ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో చర్చించారు. మంగళవారం సుప్రసిద్ధ ధవశేళ్వర క్షేత్రాన్ని సందర్శించి ముక్కంటి సన్నిధిలో పూజలు చేశారు. తర్వాత సీఎం నవీన్‌ పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ పరిధిలోని సేరగడ సమితిలో ఎన్నికల ప్రచారం చేశారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని