logo

ఓలీవుడ్‌ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం

బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.

Published : 10 May 2024 03:12 IST

ప్రచారంలో ప్రజలకు నమస్కరిస్తున్న భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో సాగిన ప్రచార ఊరేగింపులో దశావతారాలు, అశ్వాలు, పులి-ఆంబోతు నృత్య బృందాలు, ఘంటానాదాల కళాకారులు పాల్గొన్నారు. పలువురు ఓలీవుడ్‌ నటీనటులు పాల్గొని అభ్యర్థి అనిల్‌ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. రహదారుల్లో పలువురు స్థానికులు, వ్యాపారులు అభ్యర్థి అనిల్‌ కుమార్‌కు పూలమాలలు వేసి స్వాగతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని