logo

నవీన్‌ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న

నవీన్‌ మంచివారా? కాదా? మమతా, మిషన్‌శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు.

Published : 10 May 2024 03:19 IST

ప్రభుత్వ పథకాలు బాగున్నాయా..?

ప్రసంగిస్తున్న నవీన్‌. చిత్రంలో పాండ్యన్‌

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: నవీన్‌ మంచివారా? కాదా? మమతా, మిషన్‌శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. గురువారం గోపాల్‌పూర్‌ పరిధిలోని కొణిసి వద్ద బిజద ఎన్నికల బహిరంగ సభ ఏర్పాటైంది. పాల్గొన్న నవీన్‌ క్లుప్తంగా మాట్లాడారు. తాము బ్రహ్మపుర లోక్‌సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు నిలిపిన అభ్యర్థులంతా ఉత్తమ చరిత్ర, విద్యార్హత, పనులు చేసేవారని, మంచి వారికే ఓట్లేసి గెలిపించాలన్నారు. శంఖం గుర్తును మరవరాదని, తనను ఆశీర్వదించాలని మహిళల హర్షద్వానాలు మధ్య పేర్కొన్నారు.

నన్ను ఆశీర్వదించండి.. సీఎం నవీన్‌ పాదాలకు నమస్కరిస్తున్న బ్రహ్మపుర అసెంబ్లీ అభ్యర్థి చ్యవు పట్నాయక్‌

భాజపా మేనిఫెస్టో మేడిపండు

కార్యక్రమంలో వి.కార్తికేయ పాండ్యన్‌ మాట్లాడుతూ... భాజపా మేనిఫెస్టో మేడిపండు చందమన్నారు. ఆ పార్టీ పెద్దలకు జవాబుదారీతనం లేదన్నారు. 2019 ఎన్నికల్లో 2 కోట్ల యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న కేంద్రంలోని నేతలు చెప్పింది చేశారా? అంటూ ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంలో వారు రికార్డు సాధించారని ఎద్దేవా చేశారు. నేర స్థులు, అవినీతిపరులంతా భాజపా అభ్యర్థులన్నారు. బిజద విజయం తథ్యమన్నారు. జనరంజకమైన మేనిఫెస్టో నవీన్‌ విడుదల చేస్తున్నారని, దీన్ని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తున్నామని పాండ్యన్‌ పేర్కొన్నారు.

బిజద శంఖం గుర్తులతో అభిమానులు


బిజద అభ్యర్థుల్ని గెలిపించండి

అస్కా సభలో బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్న సీఎం నవీన్‌. చిత్రంలో పాండ్యన్‌, అస్కా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పాల్గొని మాట్లాడారు. అస్కాలోని కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అస్కా లోక్‌సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్‌, అస్కా సిట్టింగ్‌ ఎంపీ ప్రమీలా బిశోయి, అస్కా లోక్‌సభ బిజద అభ్యర్థిని రంజితా సాహు, సన్నొఖెముండి, పొలసరా, కవిసూర్యనగర్‌, అస్కా, కళ్లికోట, సురడా అసెంబ్లీ నియోజకవర్గాల బిజద అభ్యర్థులు సులక్షణ గీతాంజలి, శ్రీకాంత్‌ సాహు పాల్గొన్నారు.

సీఎం ఎన్నికల సభకు హాజరైన ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని