logo

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

నవరంగ్‌పూర్‌ జిల్లాలో 35 ఏళ్లుగా తమ గ్రామానికి త్రాగునీటి, రహదారి సదుపాయం లేక అవస్థలు పడుతున్నామని పలువురు నిరసన తెలిపారు.

Updated : 10 May 2024 17:14 IST

నవరంగ్‌పూర్‌: నవరంగ్‌పూర్‌ జిల్లాలో 35 ఏళ్లుగా తమ గ్రామానికి త్రాగునీటి, రహదారి సదుపాయం లేక అవస్థలు పడుతున్నామని పలువురు నిరసన తెలిపారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవటంతో సదరు సమితి హిర్లి దంగరి మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నవరంగ్‌పూర్- కోరాపుట్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామంలో యంత్రాంగం కేవలం ఒక ట్యాంకును ఏర్పాటు చేసిందని చెప్పారు. అయినా సరిపడా నీటి సరఫరా జరగటంలేదని వాపోయారు. అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. నిరసన వల్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నీటి సరఫరా శాఖ ఇంజినీర్ హరిష్ చంద్ర ప్రధాన్ ఘటనా స్థలానికి చేరుకొని నీటి సమస్యను తీర్చుతామని హామీ ఇచ్చారు. మహిళలు ఆందోళన విరమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు