logo

పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి

కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు.

Published : 29 Mar 2024 04:01 IST

మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. అశోక్‌బంగ్లాలో గురువారం తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. ఇక్కడే ఉండాలనుకుంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఐటీ కంపెనీలు తెచ్చి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు దారి చూపెడతారన్నారు. పారిశ్రామికాభివృద్ధిలేక నిరుద్యోగం పెరిగి, యువత డ్రగ్స్‌కు బానిసవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవారు ఉండకూడదనే వారిని మత్తుపదార్థాల వైపు మళ్లిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గంటా రవి, పొగిరి పైడిరాజు, గొలగాన సురేంద్ర, మాతా బుజ్జి, మజ్జి పైడిరాజు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు కోదండరాం, ప్రవీణ్‌, కార్పొరేటర్‌ కర్రోతు రాధామణి, మాజీ కౌన్సిలర్‌ రాజ్యలక్ష్మి, సర్పంచి జగదీశ్వరి పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని