logo

వైనాట్‌ 175 కాదు.. వైకాపాకు 17

జనసేన స్టార్‌ క్యాంపెయినర్‌ పృథ్వీరాజ్‌పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్‌ క్యాంపెయినర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 05:24 IST

పాలకొండలో ప్రచారం నిర్వహిస్తున్న పృథ్వీరాజ్‌

జనసేన స్టార్‌ క్యాంపెయినర్‌ పృథ్వీరాజ్‌పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్‌ క్యాంపెయినర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. వైకాపా పాలనతో రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోయిందని విమర్శించారు. కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా శుక్రవారం పాలకొండలోని ఎనిమిదో వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోందని, ప్రజలు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమిదే విజయమన్నారు. వైనాట్‌ 175 అన్న భ్రమల్లో వైకాపా నాయకులు ఉన్నారని, వారికి దక్కేది 17 మాత్రమే అన్నారు. పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. జగన్‌ ఆగడాలు భరించలేక విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారన్నారు. సొంత చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జగనన్న బాణం ఆయనకే తిరిగి గుచ్చుకుంటోందన్నారు. చిన్న దెబ్బతగిలితే సానుభూతి పొందేందుకు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో లబ్ధి పొందేందుకే ఈ నాటకాలన్నారు. సమావేశంలో అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, కూటమి నాయకులు పాండురంగ, గంటా సంతోష్‌, అంపోలు శ్రీను, వెన్నపు శ్రీను, గర్భాన సత్తిబాబు, తేజోవతి, సునీతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

కళావతికి చివరి ఎన్నికలు...

పాలకొండ పట్టణంలోని వడమ కూడలి వద్ద ప్రజలనుద్దేశించి పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ వైకాపా తరఫున రెండుసార్లు గెలుపొందిన కళావతి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈమెకు ఇవే చివరి ఎన్నికలన్నారు. జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ  గెలిస్తే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా మహిళలు, వ్యాపారులను కలిసి కరపత్రాలు పంచుతూ జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జగన్‌ పాలనపై పేరడి గీతం పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని