logo

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా అన్నారు.

Published : 27 Apr 2024 05:26 IST

మాట్లాడుతున్న పరిశీలకుడు దీపక్‌మిశ్రా

పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా పూర్తి చేయడం దృష్టిసారించాలన్నారు. చిన్న తప్పు జరిగినా ఉద్యోగ జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా పని చేయాలని కోరారు. జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ వివరించారు. ఉద్యాన కళాశాలలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పోలీసుశాఖ పరంగా తీసుకున్న చర్యలను ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ తెలియజేశారు. రాష్ట్ర అదనపు డీజీపీ శంఖ బ్రత బాగ్చి, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్ద, నయీం ముస్తఫా మన్సూరీ, విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని, జేసీ శోభిక, అదనపు ఎస్పీ దిలీప్‌కిరణ్‌, ఏఎస్పీ సునీల్‌ షరోన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు