logo

ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే పంచాయతీ భవనం

తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది.

Published : 02 May 2024 17:39 IST

బలిజిపేట: తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది. వెంగాపురం గ్రామంలో అయిదు దశాబ్దాల కిందట నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసింది. గుత్తేదారుడు సుమారు రూ.రెండు లక్షలు ఖర్చు చేసి బేసిమెంట్‌ వరకు పనులు పూర్తి చేశారు. ఈలోగా ఈ పనులను ఆకస్మికంగా విజిలెన్సు అధికారులు పరిశీలించి, పనుల నాణ్యత లోపించిందని, రూ.1.40లక్షలు సదరు గుత్తేదారుడి నుంచి రికవరీ చేశారు. ఈ అంశంపై పంచాయతీరాజ్‌శాఖ జేఈ అంబేడ్కర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఈ భవనం స్థానంలో సచివాలయ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని