logo

వర్షంతో ఉపశమనం

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 14.50 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది.

Published : 08 May 2024 04:41 IST

విజయగనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 14.50 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. జామి మండలంలో 37.4 మి.మీ, వేపాడ- 35.2 మి.మీ, ఎస్‌.కోట- 23.8, రాజాం- 19.4, విజయనగరం- 18.8, ఎల్‌.కోట- 18.6, మెరకముడిదాం- 18.2, భోగాపురం- 17.4, గజపతినగరం- 17.2, కొత్తవలస- 16.4, డెంకాడ- 16.4, గంట్యాడ- 15.2, బొబ్బిలి- 15.2, దత్తిరాజేరు- 12.8, నెల్లిమర్ల- 12.4, తెర్లాం- 11.6, గరివిడి- 10.8, రామభద్రపురం- 10.6, చీపురుపల్లి- 10.2, గుర్ల, సంతకవిటి, బాడంగి, మెంటాడ, బొండపల్లి, పూసపాటిరేగ, రేగిడి ఆమదాలవలస, వంగర మండలాల్లో 2 మి.మీ నుంచి 9 మి.మీ లోపు వర్షం కురిసింది.  మొక్కజొన్నకు ఎంతో ఉపయోగపడుతుందని, మామిడి పంట కోత దశలో ఉన్నందున గాలులకు రాలిపోయే ప్రమాదం ఉంటుందని, వేసవి దుక్కులు చేసుకునేందుకు ఉపకరిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు