logo

తెదేపాలోనే విజయనగరం అభివృద్ధి

విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలపునిచ్చారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగిన యువగళం సభలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 05:00 IST

మాట్లాడుతున్న లోకేశ్‌, చిత్రంలో అశోక్‌, అదితి, కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం అర్బన్‌, పట్టణం, కోట, రింగురోడ్డు, న్యూస్‌టుడే: విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలపునిచ్చారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగిన యువగళం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలోనే విజయనగరం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ‘గోస్తనీ, చంపావతి ద్వారా నగరానికి తాగునీరందించే ప్రాజెక్టులు రూపొందించాô. ఫ్లైఓవర్స్‌, బ్రిడ్జిలు, రోడ్లు, సంతకాల వంతెన, బైపాస్‌లు నిర్మించాం. మహారాజా ఆసుపత్రిని 300 పడకలుగా తీర్చిదిద్దాం.. నిరుపేదలకు సొంత ఇల్లు కోసం పెద్దఎత్తున టిడ్కో గృహాలు కట్టాం’ అని పేర్కొన్నారు. ‘తోటపల్లి ప్రాజెక్టును ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రభుత్వం పైసా వెచ్చించలేదు. భోగాపురం విమానాశ్రయానికి అశోక్‌ నాయకత్వంలో భూసేకరణ జరిగింది. వైకాపా వచ్చి మేం శంకుస్థాపన చేసిన రాయిని పగులకొట్టి మళ్లీ శంకుస్థాపన చేశారని’ విమర్శించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు