logo

విద్యా దీవెన నిధులపై తల్లులకు అవగాహన

విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించిన సంయుక్త ఖాతాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే తక్షణమే అప్‌డేట్‌ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్‌.లక్ష్మానాయక్‌ సూచించారు.

Updated : 23 May 2024 02:35 IST

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్‌.లక్ష్మానాయక్‌  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించిన సంయుక్త ఖాతాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే తక్షణమే అప్‌డేట్‌ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్‌.లక్ష్మానాయక్‌ సూచించారు. 2023-24 సంవత్సరానికి విద్యా, వసతి దీవెన పథకాలకు సంబంధించి ఎనిమిది అంశాలపై స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో బుధవారం ఒంగోలు డివిజన్‌ పరిధిలోని గ్రామ, వార్డు సంక్షేమ విద్యా సహాయకులు, కళాశాలల సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు విడుదలైన నిధులను కళాశాలలకు చెల్లించని తల్లులకు అవగాహన కల్పించి వాటిని చెల్లించే విధంగా చూడాలన్నారు. ఆరంచెల విధానంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కారణాలను నవశకం లాగిన్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ఎన్‌పీసీఐ పెండింగ్‌ ఉన్న ఎస్సీ విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ను బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. సకాలంలో ఆప్‌డేట్‌ చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో సంక్షేమ శాఖ అధికారులు ఎం.ఉదయశ్రీ, యు.దానయ్య, కె.శ్రీనివాసులు, అమర సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని