logo
Published : 29/11/2021 04:53 IST

చీరాల రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

వివరాలు వెల్లడిస్తున్న జీఆర్పీ డీఎస్పీ సీఐ, ఎస్సైలు

చీరాల నేర విభాగం, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి రైలులో తరలిస్తున్న గంజాయిని చీరాల జీఆర్పీ సిబ్బంది ఆదివారం రాత్రి చాకచక్యంగా పట్టుకున్నారు. జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. బిలాస్‌పూర్‌ - తిరుపతి (17481) రైలులో గంజాయి రవాణా చేస్తున్నారని అధికారులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. దీంతో రైలు చీరాల స్టేషన్‌కు రాగానే ఎస్సై సీహెచ్‌ కొండయ్య, సిబ్బంది... అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల సంచులను తనిఖీ చేశారు. వాటిలో 15 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కుమార్‌దలై, అనిల్‌కుమార్‌ జేనాగా గుర్తించారు. రాయగఢ నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. చురుగ్గా స్పందించి నిందితులను పట్టుకున్న ఎస్సైతో పాటు హెచ్‌సీ శ్రీనివాసరావు, సిబ్బంది కరీముల్లా, కె.శ్రీనివాసరావు, బాదర్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో జీఆర్పీ ఒంగోలు సీఐ వై.రామారావు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని