logo

త్రివర్ణ ప్రకాశం.. నేడే సంబరం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం ఉదయం ఒంగోలు నగరంలో నిర్వహించనున్న త్రివర్ణ ప్రకాశం ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు ఉత్తర బైపాస్‌లోని రవిప్రియా మాల్‌ నుంచి ఆరంభమై అద్దంకి బస్టాండ్‌, పాత...

Published : 14 Aug 2022 02:12 IST

3 కి.మీ. పొడవైన జాతీయ జెండా ప్రదర్శనకు ఏర్పాట్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం ఉదయం ఒంగోలు నగరంలో నిర్వహించనున్న త్రివర్ణ ప్రకాశం ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు ఉత్తర బైపాస్‌లోని రవిప్రియా మాల్‌ నుంచి ఆరంభమై అద్దంకి బస్టాండ్‌, పాత మార్కెట్‌ సెంటర్‌, మస్తాన్‌ దర్గా, ట్రంకురోడ్డు, చర్చి సెంటర్‌, కలెక్టరేట్‌, నెల్లూరు బస్టాండ్‌ మీదుగా మినీ స్టేడియం వరకు మూడు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ కొనసాగనుంది. 6 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మినీ స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా...
దక్షిణ బైపాస్‌ నుంచి ఒంగోలులోకి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను పాత బైసాస్‌ రోడ్డులో వెంగముక్కపాలెం కూడలి, కర్నూలురోడ్డు పై వంతెన నుంచి నగరంలోకి ప్రవేశం కల్పిస్తారు.
* దక్షిణ బైపాస్‌ నుంచి ఒంగోలులోని రైల్వేస్టేషన్‌, కొత్తపట్నం బస్టాండ్‌, సంతపేట, రాంనగర్‌ వెళ్లేవారు పెళ్లూరు వద్ద ఉన్న కొత్త బైపాస్‌ నుంచి పై వంతెన మీదుగా కొప్పోలు రోడ్డు వద్ద నుంచి కొత్తపట్నం బస్టాండ్‌లోకి మళ్లాలి.
* ఉత్తర బైపాస్‌ నుంచి వచ్చే బస్సులు, ఇతర ట్రాఫిక్‌ను పాత బైపాస్‌ మార్గంలో పై వంతెన, మంగమూరురోడ్డు కూడలి నుంచి నగరంలోకి ప్రవేశం కల్పిస్తారు.
* ఉత్తర బైపాస్‌ నుంచి రైల్వేస్టేషన్‌, కొత్తపట్నం బస్టాండ్‌, సంతపేట, రాంనగర్‌ వచ్చేవారికి కిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఉన్న పై వంతెన నుంచి కేశవరాజుకుంట, బలరాం కాలనీ, గోపాల నగర్‌, కమ్మపాలెం మీదగా ప్రవేశం ఉంటుంది. ‌్ర అన్ని బస్సులు పాత బైపాస్‌ నుంచే రాకపోకలు కొనసాగనున్నాయి. ట్రంకురోడ్డు మీదుగా రాకపోకలు నిషేధించారు. ఆదివారం ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు ఇటు వచ్చే ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని