logo

నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని ధర్నా

అంగన్‌వాడీ గ్రేడ్‌-2 పర్యవేక్షకుల పోస్టుల నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సహాయ కార్యదర్శి పి.కల్పన మాట్లాడుతూ.. ఈ నెల 18న అంగన్‌వాడీ

Published : 27 Sep 2022 02:08 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ గ్రేడ్‌-2 పర్యవేక్షకుల పోస్టుల నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సహాయ కార్యదర్శి పి.కల్పన మాట్లాడుతూ.. ఈ నెల 18న అంగన్‌వాడీ పర్యవేక్షకుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ ఇంతవరకు కీ విడుదల చేయలేదన్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహస్యంగా కొందరిని పిలిచి ఎంపికయ్యారని చెప్పడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. నియామకాల్లో అవినీతి, రాజకీయ జోక్యం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఎలాంటి అక్రమ పద్ధతులకు తావు లేకుండా నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీ అభిషిక్త్‌ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సంఘం నాయకురాలు ధనలక్ష్మి, జయశ్రీ, ఆదిలక్ష్మి, కాలం సుబ్బారావు, బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని