logo

యువగళం.. సంఘీభావం

‘యువగళం’ పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

Published : 28 Jan 2023 02:47 IST

సభా ప్రాంగణంలో లోకేశ్‌కు తలపాగా పెడుతున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘యువగళం’ పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. 400 రోజులపాటు 4 వేల కిలో మీటర్లు సాగే యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మొదటి రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశారు. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చేపట్టిన మద్దతు కార్యక్రమాల్లో పెద్దఎత్తున శ్రేణులు పాల్గొన్నాయి. ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు సెంటర్‌లోని వీరాంజనేయస్వామి దేవస్థానం వద్ద 108 కొబ్బరి కాయలు కొట్టారు. జేఎంబీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు, మస్తాన్‌ దర్గా వద్ద దువా చేపట్టారు.

ఒంగోలు నగర వీధుల్లో సాగుతున్న తెదేపా శ్రేణుల ద్విచక్ర వాహన ప్రదర్శన

కుప్పంలో నేతలు...: నారా లోకేశ్‌ కుప్పంలో చేపట్టిన పాదయాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా నాయకులు మొదటి రోజైన శుక్రవారం పాల్గొన్నారు. లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ఆయనకు తలపాగా పెట్టి సంఘీభావం తెలిపి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండపి, అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, బీఎన్‌.విజయకుమార్‌, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి, కందుకూరు నియోజకవర్గ బాధ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీ తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని