logo

పోలీసులు పిలిచారని

పోలీసులు విచారణకు పిలవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

Published : 28 Jan 2023 02:47 IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మృతి

మండ్ల లక్ష్మయ్య  ( పాత చిత్రం)

అర్థవీడు: పోలీసులు విచారణకు పిలవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని కాకర్ల గ్రామంలోని ఓ ఇంటో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి చెందని మండ్ల లక్ష్మయ్య (40)తోపాటు మరో ఇద్దరిని విచారించి పంపారు. మరుసటి రోజు లక్ష్మయ్యను స్టేషన్‌కు రావాలని కబురు పెట్టారు. పోలీసులు కొడతారని రెండో రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే అర్థవీడు బస్టాండ్‌లో పురుగుల మందు తాగి లక్ష్మయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు అతన్ని వెంటనే అతడిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించి వైద్యం అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. లక్ష్మయ్యకు భార్య ఉన్నారు. పోలీసుల ప్రవర్తనపై ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు దిశా డీఎస్పీ విచారణ చేపట్టారు.


మృతి చెందిన సుబ్బయ్య (పాత చిత్రం)

లారీని ఢీ కొని...: కంభం, న్యూస్‌టుడే : ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై కంభం పట్టణ సమీపంలోని పైవంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  హైదరాబాద్‌ నుంచి గిద్దలూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఇసుక లోడుతో ముందు వెళ్తున్న లారీని దాటే క్రమంలో బస్సు ఎడమవైపు భాగం లారీని ఢీ కొంది. దీంతో ఆ వైపు కూర్చొని ఉన్న బస్సు క్లీనర్‌ జె.సుబ్బయ్య(19) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. సొంతూరు మార్కాపురం మండలం చింతకుంట్ల. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని