logo

ఈ-వాహనాలతోే పర్యావరణ పరిరక్షణ

విద్యుత్తు వాహనాలను ఎక్కువ మంది వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు; రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను ఆదా చేయొచ్చని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. విద్యుత్తు వాహనాల వినియోగంపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Updated : 02 Jun 2023 06:22 IST

ఆటో నడిపి పనితీరు పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

విద్యుత్తు వాహనాలను ఎక్కువ మంది వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు; రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను ఆదా చేయొచ్చని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. విద్యుత్తు వాహనాల వినియోగంపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వినియోగం కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతోందని, ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే ఈ-ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తే కాలుష్యంతో పాటు, ఇంధన ఖర్చు బాగా  తగ్గుతుందన్నారు. ఇందుకుగాను ఈ-ద్విచక్ర వాహనాలు, కార్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. తొలుత ఈ-ఆటో, ఈ-వాహనాలను ఆయన స్వయంగా నడిపి పరిశీలించారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ డీజీఎం హరనాథ్‌బాబు, పీసీబీ ఈఈ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని