logo

సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు.

Published : 30 Apr 2024 03:35 IST

ముగిసిన నామపత్రాల ఉపసంహరణ
తేలిన బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క

ఈనాడు, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు 206 మంది 354 నామపత్రాలు అందజేశారు. ఈ నెల 26న అధికారులు పరిశీలన చేపట్టి పార్లమెంట్‌ స్థానంలో ఏడింటిని తిరస్కరించి ఇరవై అయిదింటికి ఆమోదం తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో 48 తిరస్కరించి.. 158 ఆమోదించారు. నామినేషన్ల పర్వంలో చివరి అంకమైన ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. ఒంగోలు పార్లమెంట్‌ బరి నుంచి ఎవరూ ఉపసంహరించుకోకపోవడంతో తెదేపా, వైకాపాతో పాటు 25 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 19 ఉపసంహరించుకోగా 139 మంది మిగిలారు. ఇకపై వీరంతా పదమూడు రోజులపాటు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఒక నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు, ఒక నోటాతో కలిపి 16 మందికి అవకాశం ఉంటుంది. బరిలో అంతకంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ రెండు ఈవీఎంలను వినియోగించాల్సి వస్తుంది. ఆ ప్రకారం ఒంగోలు పార్లమెంట్‌ స్థానంతో పాటు గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాలకు రెండు ఈవీఎంలను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని