logo

నిరుద్యోగ యువత వేసే మార్కులు సున్నా

ప్రోగ్రెస్‌ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్‌కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు.

Published : 02 May 2024 02:11 IST

ఒంగోలులోని నెల్లూరు రోడ్డులో నిరసన తెలుపుతున్న బస్సు యాత్ర సభ్యులు

ఒంగోలు కర్నూలు రోడ్డు, న్యూస్‌టుడే: ప్రోగ్రెస్‌ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్‌కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐకాస చేపట్టిన బస్సు యాత్ర బుధవారం ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు రోడ్డులోని బస్టాండ్‌ వద్ద తొలుత నిరసన తెలిపారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నిరుద్యోగ ఐకాస కన్వీనర్‌ సిద్దిఖ్‌ మాట్లాడారు. పాదయాత్ర సమయంలో నిరుద్యోగులను ఉద్దరిస్తానంటూ అనేక హామీలిచ్చి నమ్మించిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారని విమర్శించారు. ఏటా జనవరి 1న జాజ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు, 6,500 పోలీసు ఉద్యోగాలు, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 167 గ్రూప్‌1 ఉద్యోగాలను తన అనుకూలురకు వైకాపా ప్రభుత్వం రూ.150 కోట్లకు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేసిందని విమర్శించారు. య్రాలో భాను, గంగాధర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు