logo

తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట

వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు.

Published : 07 May 2024 02:45 IST

తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరిన బాలసుబ్బారావు, తదితరులు

పొదిలి, మార్కాపురం పట్టణం, కొనకనమిట్ల, పొదిలి, పెద్దారవీడు, కంభం, యర్రగొండపాలెం పట్టణం,గిద్దలూరు పట్టణం : వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. సోమవారం కనిగిరి వెళ్తూ పొదిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలో రావాలని పిలుపునిచ్చారు.

  •  ఓటింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్ది తెదేపాలోకి వలసల జోరు కొనసాగుతుంది. వైకాపా జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమళ్ల బాలసుబ్బారావు తన అనుచరులతో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో తెదేపా  చేరారు. మార్కాపురం పట్టణంలోని 24వ వార్డుకు చెందిన డీలర్‌ కేవీ నారాయణరెడ్డి వారి అనుచరులు తెదేపాలో చేరారు. నాయుడుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన 20వైకాపా కుటుంబాలు కందుల రామిరెడ్డి నివాసం వద్ద తెదేపాలో చేరారు.
  • నారాయణరెడి కాట్రకుంట లో కొనకనమిట్ల మండలంలో సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.
  •  పొదిలి 9వ వార్డులో సోమవారం కందుల సోదరి యేరువా లక్ష్మి, మాగుంట రాఘవరెడ్డి సతీమణి మాగుంట చందనారెడ్డి తెదేపా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
  • పెద్దారవీడు మండలంలోని హనుమాన్‌జంక్షన్‌కుంటలో సోమవారం మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎరిక్షన్‌బాబు ర్యాలీ నిర్వహించారు.
  • .పెద్దదోర్నాలలో సోమవారం రాత్రి తెదేపా నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలను మంచి స్పందన లభించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబులు స్థానిక ఏఎంసీ యార్డు నుంచి నటరాజ్‌ కూడలి మీదుగా శ్రీశైలం బస్టాండు వరకు ప్రదర్శన నిర్వహించారు
  •  కంభం మాజీ సర్పంచి స్టార్‌ బాష, ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
  • పుల్లలచెరువు మండలం మల్లపాలెం, పీఆర్‌సీతండా లలో సోమవారం తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిలు విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. 
  • గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ముత్తుముల అశోక్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని