logo

అరాచక పాలనను అంతమొందిద్దాం

రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు.

Published : 07 May 2024 02:50 IST

టీబీకే అధ్యక్షుడు దాసరి రాము

రామును సత్కరిస్తున్న కాపు సంఘం నాయకులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. సోమవారం స్థానిక రామనగర్‌ ఒకటోలైన్‌లో ముఖ్యులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాసరి రాము ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మంచిని గెలిపించినట్లన్నారు. ఒంగోలు పరిధిలో కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని, అయితే వైకాపా దుర్మార్గపు పాలన నుంచి ప్రజల్ని కాపాడటంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు సంజీవకుమార్‌ మాట్లాడుతూ కాపు సంఘం మద్దతు జనసేన కూటమికి తెలిపినందున ఇక్కడ పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ను గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కాపు నాయకులు మారిశెట్టి చంద్రశేఖర్‌, కోలా హనుమంతరావు, ఇందుర్తి మారుతీరావు, తంజీవూరు శ్రీనివాసమూర్తి, ఉమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, ముల్యాల నాగేశ్వరరావు, చెరుకూరి ఫణీంద్ర, పోకల రాంబాబు, చెన్నంశెట్టి శివ  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని