logo

నగదు బదిలీతో ఓట్ల కొనుగోలు

నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన   ఉదంతంపై దర్శి పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్‌ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

Updated : 08 May 2024 07:43 IST

దర్శి పీఎస్‌లో రెండు కేసుల నమోదు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన   ఉదంతంపై దర్శి పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్‌ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వారిపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ పార్టీ తరపున గుత్తా నారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్‌ నంబర్లు సేకరించి  గోవిందయ్యకు ఇచ్చి అతని యూపీఐ ఖాతాకు రూ.20వేలు నగదు బదిలీ చేశారన్నారు. ఆయన తన ఖాతా నుంచి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.అయిదువేల చొప్పున చెల్లించి ఓట్లు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. మరో పార్టీకి చెందిన చిన్నపురెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరిరెడ్డి అనే వ్యక్తికి రూ.55వేలు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేస్తే అతను ఉద్యోగులకు రూ.అయిదువేల చొప్పున ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఎన్నికల నియమావళి మేరకు ఓట్లు కొనుగోలుచేసిన వారితో పాటు తమ ఓట్లు అమ్ముకున్న ఉద్యోగులపైనా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సుమిత్‌ సునీల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు