logo

చెరువుల అభివృద్ధి ఒట్టి నీటి మాటే

పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు.

Published : 10 May 2024 01:40 IST

నీరు రాక బీళ్లుగా వదిలేసిన ఆయకట్టు

ఆనవాళ్లుగా మిగిలిన పెద్దచెరువు అలుగు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. దీని క్రింద అధికారికంగా 811 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 150 మంది వరకు రైతులు ఉన్నారు. పొదిలి చిన్నచెరువు విస్తీర్ణం 101 ఎకరాలు. 238 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండి పదేళ్లు దాటింది. దశాబ్దాలుగా చెరువులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో కాలువలు, తూములు, అలుగులు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ ఐదేళ్లలో పెద్దచెరువు బలోపేతానికి కట్టపై మట్టి తోలారు. కాలువలు, తూముల మరమ్మత్తులకు, చెరువులకు నీరు వచ్చే కాలువలను విస్మరించారు. దీంతో ఆర్థికస్థోమత గల రైతులు బోర్లు వేసి వరి సాగుచేసుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు తమ మాగాణి భూములను బీళ్లుగా వదిలేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న పొదిలి మండలం సాగు విస్తీర్ణం ప్రాజెక్టు పరిధిలోకి రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కేవలం వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండించే పొదిలి మండల రైతులు తమ మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో తమ మండలాన్ని చేరిస్తే కాలువల నుంచి వచ్చే నీటిని చెరువులకు మళ్లిస్తే ఈప్రాంతం రైతాంగానికి మేలు జరుగుతుంది. ఈ అయిదేళ్లు వైకాపా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న పొదిలి పెద్దచెరువు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు