logo

చైతన్యం స్వల్పమే..!

ఓటు హక్కు పొందాలి...: ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. 18 ఏళ్లు నిండిన వారంతా తప్పనిసరిగా ఓటుహక్కు పొందాలి. ఎవరికైనా సందేహాలు ఉంటే సమీపంలోని తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించవచ్ఛు ఓటరు

Published : 09 Dec 2021 04:22 IST

ఓటు హక్కు పొందాలి...: ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. 18 ఏళ్లు నిండిన వారంతా తప్పనిసరిగా ఓటుహక్కు పొందాలి. ఎవరికైనా సందేహాలు ఉంటే సమీపంలోని తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించవచ్ఛు ఓటరు హెల్ప్‌లైన్‌, ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు

 

- బి.దయానిధి, డీఆర్‌వో

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో గత నెలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. 18 ఏళ్ల వయసు నిండినవారంతా ఓటు హక్కు పొందేందుకు ముందుకు రావాలని అవగాహన కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ దరఖాస్తులను స్వీకరించారు. దానికి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. జిల్లాలో 18-19 ఏళ్ల వయసువారు 62,564 మంది ఉన్నప్పటికీ 14,670 మంది మాత్రమే ఓటు హక్కు పొందేందుకు ముందుకు రావడం గమనార్హం. ఓటరుగా నమోదయ్యేందుకు, మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం 20,602 దరఖాస్తులు రాగా వాటిలో ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి అత్యధికంగా, పలాస నుంచి అత్యల్పంగా వచ్చాయి. టెక్కలి, ఆమదాలవలస, రాజాం నియోజకవర్గాల్లోనూ 1,000 మంది లోపే దరఖాస్తులు సమర్పించారు. ఫారం-7కు 4,951, ఫారం-8కి 557, పారం-8ఏ 424 అర్జీలు రావడం గమనార్హం.

నియోజకవర్గాల వారీగా వివరాలిలా..

-----------------------------

ప్రాంతం వచ్చిన

దరఖాస్తులు

-----------------------------

ఇచ్ఛాపురం 4,173

పలాస 648

టెక్కలి 868

పాతపట్నం 2,277

శ్రీకాకుళం 2,364

ఆమదాలవలస 814

ఎచ్చెర్ల 1,198

నరసన్నపేట 3,951

రాజాం 886

పాలకొండ 3,423

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని