logo

వైద్యఆరోగ్య శాఖలో బదిలీల సందడి

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల సందడి ప్రారంభమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది. ఒకేచోట అయిదేళ్లుగా పనిచేస్తున్న వారంతా....

Published : 29 Jan 2022 05:24 IST

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల సందడి ప్రారంభమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది. ఒకేచోట అయిదేళ్లుగా పనిచేస్తున్న వారంతా బదిలీలకు అర్హులని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, 28లోగా బదిలీల ప్రక్రియ ముగుస్తుందని అందులో వెల్లడించింది. ఈ క్రమంలో జిల్లాలో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టు నుంచి గెజిటెడ్‌ వారీగా బదిలీలకు అర్హుల జాబితా తయారీలో సంబంధిత విభాగాల వారు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 700 మందికి పైగా స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో బదిలీలు ఉండటంతో ఆయా వర్గాలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథరావు మాట్లాడుతూ బదిలీల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని