logo

ఆదిత్యుడికి కిరణస్పర్శ

అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు వరుసగా రెండోరోజు ఆదివారం కూడా పాక్షికంగా తాకాయి. ఉదయం 6.04 గంటలకు కిరణస్పర్శ ప్రారంభమై 6.08 గంటల వరకు నాలుగు నిమిషాలపాటు కొనసాగింది. లేలేత కిరణాలు ధ్వజస్తంభం మీదుగా స్వామిని చేరాయి.

Published : 03 Oct 2022 02:50 IST

రెండో రోజు 4 నిమిషాల పాటు దర్శనం

మూలవిరాట్‌ను తాకుతున్న సూర్యకిరణాలు

అరసవల్లి, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు వరుసగా రెండోరోజు ఆదివారం కూడా పాక్షికంగా తాకాయి. ఉదయం 6.04 గంటలకు కిరణస్పర్శ ప్రారంభమై 6.08 గంటల వరకు నాలుగు నిమిషాలపాటు కొనసాగింది. లేలేత కిరణాలు ధ్వజస్తంభం మీదుగా స్వామిని చేరాయి. ఆ సమయంలో మూలవిరాట్‌ బంగారుఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులుదీరారు. వారికి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని