logo

‘సమరయాత్ర’కు స్వాగతం

హిందూపురంలో గత నెల 25న ప్రారంభమైన సమరయాత్ర శుక్రవారం జిల్లాకు చేరుకుంది. ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న యాత్రకు శ్రీకాకుళం నగరంలో పలు ప్రజాసంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు.

Published : 04 Feb 2023 04:12 IST

డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న వివిధ సంఘాల నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), అరసవల్లి, న్యూస్‌టుడే: హిందూపురంలో గత నెల 25న ప్రారంభమైన సమరయాత్ర శుక్రవారం జిల్లాకు చేరుకుంది. ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న యాత్రకు శ్రీకాకుళం నగరంలో పలు ప్రజాసంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. డే అండ్‌ నైట్‌ కూడలి నుంచి   ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు ప్రజలంతా ఉద్యమించాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఎస్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీˆడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్‌బాబు, శివారెడ్డి, పి.రాజేంద్ర, లెనిన్‌బాబు, రాము పాల్గొన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో రాత్రి బస చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు