logo

సాంకేతిక నైపుణ్యంతో అధునాతన సర్వే

సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే అధునాతన సర్వే చేయవచ్చునని భారతీయ భూగర్భ సర్వే సంస్థ మాజీ డైరెక్టర్‌ ఉండవల్లి రవికుమార్‌ అన్నారు.

Published : 21 Mar 2023 05:39 IST

ప్రసంగిస్తున్న భారతీయ భూగర్భ సర్వే సంస్థ మాజీ డైరెక్టర్‌ రవికుమార్‌

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే అధునాతన సర్వే చేయవచ్చునని భారతీయ భూగర్భ సర్వే సంస్థ మాజీ డైరెక్టర్‌ ఉండవల్లి రవికుమార్‌ అన్నారు. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అధునాతన సర్వే పద్ధతులు, విధానాలు (గ్రోమాటికా) అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యశాల సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్లోబల్‌ పొజిషన్‌ ఇన్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) టోటల్‌ స్టేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, మిలటరీ సర్వే, డ్రోన్‌ సర్వే, తదితరాలపై విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. పురాతన కాలం నుంచి అమలు చేస్తున్న సర్వే విధానంలో ఇప్పటివరకు వచ్చిన మార్పులను దశల వారీగా వివరించారు. సర్వే రంగంలో యువతకు అవకాశాలు ఉన్నాయని, వాటికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ పి.జగదీశ్వరరావు మాట్లాడుతూ మానవ జీవన విధానంతో సర్వే అనే అంశం ముడిపడి ఉందన్నారు. ట్రిపుల్‌ ఐటీ ఓఎస్‌డీ ఎల్‌డీ.సుధాకర్‌బాబు, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి, ఏవో ఎం.రామకృష్ణ, ఎఫ్‌వో అసిరినాయుడు, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి తేజ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు