logo

మహిళల భద్రత కోసమే 112: ఎస్పీ

మహిళల భద్రత కోసం 112 టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆ నంబరుకు కాల్‌ చేస్తే ఒంటరి మహిళలను రాత్రి వేళల్లో పోలీసు వాహనాల్లో సురక్షితంగా ఇంటి వద్దకు తీసుకువెళ్తారని ఎస్పీ జి.ఆర్‌.రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Mar 2023 03:33 IST

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: మహిళల భద్రత కోసం 112 టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆ నంబరుకు కాల్‌ చేస్తే ఒంటరి మహిళలను రాత్రి వేళల్లో పోలీసు వాహనాల్లో సురక్షితంగా ఇంటి వద్దకు తీసుకువెళ్తారని ఎస్పీ జి.ఆర్‌.రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేక ఇంటికి చేరుకోలేని మహిళల కోసం ‘నైట్‌ డ్రాప్‌ టు హోం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. రాత్రి 11 గంటల తర్వాత అధైర్య పడకుండా 112 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే సంబంధిత పోలీసులు సబ్‌ డివిజన్‌ పరిధిలోని, అందుబాటులో ఉన్న పోలీసు వాహనం ద్వారా సురక్షితంగా మీ ఇంటికి చేర్చుతారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని