logo

27న పాలిసెట్‌-2024

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న  నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 26 Apr 2024 03:45 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న  నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాలిసెట్‌ పరీక్ష జిల్లా సమన్వయకర్తలు గురుగుబెల్లి దామోదరరావు, ఏ.గోపి మాట్లాడుతూ శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో మొత్తం 26 కేంద్రాల్లో 7,178 విద్యార్థులు, టెక్కలి డివిజన్‌ పరిధిలో 16 కేంద్రాల్లో 4,756 మంది మొత్తం జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో 11,934 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు రావాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని