logo

అవే బాధలు.. అందలేదు డబ్బులు

పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 05 May 2024 04:53 IST

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

గోవిందపురం ఎస్‌బీఐలో పింఛను కోసం పండుటాకుల నిరీక్షణ

పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం ఛార్జీలు చెల్లించి వస్తే తీరా అవి కావాలి, ఇవి కావాలంటూ బ్యాంకు ఉద్యోగులు అవస్థలు పెడుతున్నారు. శనివారం వచ్చిన పండుటాకులు ఎండలో బాధలు పడ్డారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ఎస్‌బీఐ, గ్రామీణ వికాసబ్యాంకుల చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నారు.


రెండు రోజులుగా తిరుగుతున్నా  
- పాండ్రాడి మల్లేశ్వరరావు, అమలపాడు

పింఛనే ఆధారం. రెండు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతుంది. మా గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల నడిచి వచ్చా. పింఛను ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్లిపోతున్నా.


నిరాశతో వెళ్తున్నా..
- కావళ్ల నూకమ్మ, ఎంఎన్‌పేట

బ్యాంకు ఖాతాలో సొమ్ములు పడ్డాయన్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందపురం బ్యాంకుకు వచ్చా. డబ్బులు పడ్డాయో లేదో చూద్దామని వస్తే బ్యాంకు పని వేళలు ముగిశాయన్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని