logo

పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రారంభం

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు.

Published : 05 May 2024 04:57 IST

శ్రీకాకుళంలో పోలింగ్‌ కేంద్రం వద్ద సాయంత్రం 5 గంటల తరువాత క్యూలైన్‌లో వేచి ఉన్న ఓటర్లు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25,505 మందికి తొలిరోజు 7,004 మంది ఓటేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తొలిరోజు పీవో, ఏపీవో సూక్ష్మపరిశీలకులు, హోం ఓటింగ్‌ పోలీసు సిబ్బంది, తదితరులకు ఓటు వేయాలని నిర్దేశించినప్పటికీ.. 5, 6 తేదీల్లో కేటాయించిన సిబ్బంది కూడా ఓటింగ్‌కు రావడంతో తొలి రోజు అన్ని కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా.. ఎచ్చెర్లలో అత్యల్పంగా సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని