logo

నౌపడలో ఓటర్లకు వైకాపా ప్రలోభం

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు.

Published : 08 May 2024 05:07 IST

ఇంటింటికీ చిట్టీలు పంచుతున్న నేతలు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే స్లిప్పుపై 6 అని సంఖ్య రాసి ఇస్తున్నారు. స్లిప్పులు ఇచ్చిన ఓటరు మొబైల్‌ నంబరు, ఫొటోలు తీసుకొని మభ్యపెడుతున్నారు. ఆ ఇంటి గోడపై ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ‘జగన్‌ కోసం సిద్ధం’ స్టిక్కర్లు అతికిస్తున్నారు. స్లిప్పులను జాగ్రత్తగా దాచుకోవాలని, కొంత మంది రహస్యంగా వచ్చి అందులో ఉన్న ప్రకారం డబ్బులిస్తారని చెబుతున్నట్లు గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు