logo

చిట్టీవ్యాపారిని చుట్టుముట్టిన బాధితులు

టెక్కలిలో చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన మహిళ సబితాదేవిని బాధితులు మంగళవారం చుట్టుముట్టారు. ముఖానికి వస్త్రం కట్టుకొని స్థానిక బ్యాంకులో బంగారం ఆభరణాలపై ఉన్న రుణాన్ని రెన్యువల్‌ చేసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఆమెను గుర్తించి అడ్డుకున్నారు.

Published : 08 May 2024 05:08 IST

సబితాదేవిని నిలదీస్తున్న మహిళ

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలిలో చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన మహిళ సబితాదేవిని బాధితులు మంగళవారం చుట్టుముట్టారు. ముఖానికి వస్త్రం కట్టుకొని స్థానిక బ్యాంకులో బంగారం ఆభరణాలపై ఉన్న రుణాన్ని రెన్యువల్‌ చేసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఆమెను గుర్తించి అడ్డుకున్నారు. బకాయిలు చెల్లించాలని గట్టిగా నిలదీశారు. అయితే ఆమె తనచున్నీతో మెడకు గట్టిగా బిగించుకుని స్థానికులను భయపెట్టడంతో అంతా ఎదురుతిరిగారు. సుమారు 175 మందికి రూ.3 కోట్ల వరకు ఆమె టోకరా వేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ఐపీ పెట్టి 15 మందికి కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలను పలువురు బాధితులు బలవంతంగా లాక్కోవడం వివాదాస్పదమైంది. కాసేపటికి ఆమెను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇది వరకే సబితాదేవిపై కేసు నమోదు అయిందని బెయిల్‌పై బయట ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు