logo

త్వరలోనే రామరాజ్యం

రాష్ట్రానికి పట్టిన పీడ మరికొన్ని రోజుల్లో విరగడ కానుందని, త్వరలోనే రామరాజ్యం రాబోతోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మొన్న జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే ఇక వార్‌ వన్‌సైడ్‌ అయిపోయినట్లు తెలుస్తోందన్నారు.

Published : 10 May 2024 06:19 IST

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పక్కన గొండు శంకర్‌

గార, న్యూస్‌టుడే: రాష్ట్రానికి పట్టిన పీడ మరికొన్ని రోజుల్లో విరగడ కానుందని, త్వరలోనే రామరాజ్యం రాబోతోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మొన్న జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే ఇక వార్‌ వన్‌సైడ్‌ అయిపోయినట్లు తెలుస్తోందన్నారు. గార మండలంలో తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌తో కలిసి ప్రచారం చేశారు. జొన్నలపాడు నుంచి సీఎస్పీ రహదారి తూలుగు కూడలి, పేర్లవానిపేట, కొమరవానిపేట, కొర్లాం, కొర్ని, గార, పూసర్లపాడు, బూరవల్లి మీదుగా రోడ్‌షో నిర్వహించారు. దారి పొడవునా కూటమి శ్రేణులు, అభిమానులు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జగన్‌ సొంత చెల్లి షర్మిలనే రోడ్డుపై వదిలేశారంటే.. రాష్ట్రంలోని మహిళలను ఇంకేం పట్టించుకుంటారని విమర్శించారు. బాబాయిను ఎవరు చంపారో ఇంత వరకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. అనంతరం గొండు శంకర్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గార- వనితమండలం వంతెన, కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు సంవత్సరంలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

తూలుగు కూడలిలో ర్యాలీకి హాజరైన ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు