logo

‘టీబీఎం’తో పరీక్ష విజయవంతం

నగరంలో మెట్రో రెండో దశ పనులు జోరుగా జరుగుతున్నాయి. భూగర్భ మార్గంలో రెండో దశ నాలుగో మార్గంలో వినియోగించేందుకు ‘ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్‌ టెస్ట్‌’ను మొదటి టన్నల్‌ బోరింగ్‌ యంత్రంతో గురువారం సీఎంఆర్‌ఎల్‌ నిర్వహించింది.

Published : 03 Feb 2023 01:53 IST

బోరింగ్‌ యంత్రాన్ని పరీక్షిస్తున్న అధికారులు

వడపళని, న్యూస్‌టుడే: నగరంలో మెట్రో రెండో దశ పనులు జోరుగా జరుగుతున్నాయి. భూగర్భ మార్గంలో రెండో దశ నాలుగో మార్గంలో వినియోగించేందుకు ‘ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్‌ టెస్ట్‌’ను మొదటి టన్నల్‌ బోరింగ్‌ యంత్రంతో గురువారం సీఎంఆర్‌ఎల్‌ నిర్వహించింది. పూనమల్లి నుంచి లైట్‌ హౌజ్‌ వరకు 118.9 కిలోమీటర్ల దూరం వరకున్న మార్గంలో వివిధ మార్గాల నుంచి 128 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మూడో మార్గంలోని మాధవరం నుంచి సిరుసేరి వరకు 45.8 కిలోమీటర్లు, నాలుగో మార్గంలో లైట్‌ హౌజ్‌ నుంచి పూనమల్లి 26.1 కిలోమీటర్లు, అయిదో మార్గంలో మాధవరం నుంచి షోలింగనల్లూరు 47 కిలోమీటర్ల వరకు మార్గం నిర్మాణం జరుగుతోంది. తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి తాలూకా, అలింజివాక్కం గ్రామంలోని హెచ్‌కే పరిశ్రమలో టన్నల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం)తో గురువారం యాక్సెప్టెన్స్‌ టెస్ట్‌ సీఎంఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి.అచ్యుతన్‌ సమక్షంలో గురువారం నిర్వహించారు. బోరింగ్‌ యంత్రంతో పరీక్ష విజయవంతంగా జరిగిందని సీఎంఆర్‌ఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి సీజీఎం రేఖా ప్రకాశ్‌తో పాటు ఏయాన్‌ కన్సోర్టియం సంస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని