logo

అరుదైన పాము గుర్తింపు

కారులో గుర్తించిన అరుదైన పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోయంబత్తూరు జిల్లా గౌండంపాళెయంలో ఉన్న కారు సర్వీస్‌ సెంటర్‌లో కారులో బుధవారం పాము కనిపించింది.

Published : 09 Feb 2023 00:19 IST

పాముతో రతీష్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కారులో గుర్తించిన అరుదైన పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోయంబత్తూరు జిల్లా గౌండంపాళెయంలో ఉన్న కారు సర్వీస్‌ సెంటర్‌లో కారులో బుధవారం పాము కనిపించింది. ఈ విషయమై సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న పాముల భద్రత ఆర్గనైజేషన్‌కు చెందిన రతీష్‌కి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అతను పాముని బయటకు తీశాడు. ఇది అరుదైన ఎగిరే విషపూరితమైన పాము అని తెలిపాడు. ఈ పాములు పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఉంటాయని చెప్పాడు. పామును జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పగించగా వారు అడవిలో విడిచిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని