logo

చెప్పకుండా వెళ్లి.. కలవరపాటుకు గురై..

తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత పోలీసుల సమంక్షలో క్షేమంగా ఉన్నారని తెలిసి పిల్లల తల్లిదండ్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. వేదాంతపురం పంచాయతీ

Updated : 25 May 2022 10:08 IST

చిన్నారుల అదృశ్యం కేసు సుఖాంతం

తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు


పిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీఐ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది

పుత్తూరు: తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత పోలీసుల సమంక్షలో క్షేమంగా ఉన్నారని తెలిసి పిల్లల తల్లిదండ్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. వేదాంతపురం పంచాయతీ పరిధిలోని విజయనగర్‌ కాలనీకి చెందిన తేజస్విని(8), శోభారాణి(7), శాంతి(5) ముగ్గురు స్నేహితురాళ్లు. మంగళవారం ఉదయం శోభారాణి పుత్తూరులో తమ అత్త ఉందని, అక్కడి వెళ్లి వచ్చేద్దామని చెప్పి తనతో రావాలని స్నేహితురాళ్లను కోరింది. అనుకున్నదే తడవుగా వారు ఇంట్లో చెప్పకుండా బస్సు ఎక్కి తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని అక్కడి నుంచి బస్సులో పుత్తూరుకు చేరుకున్నారు. అడ్రస్‌ మరిచిపోవడంతో తిరిగి తిరుపతి వెళ్లిపోదామని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఆర్పీఎఫ్‌ పోలీసులు వీరిని గుర్తించి వివరాలు ఆరా తీసి వివరాలు సేకరించి పుత్తూరు సీఐకు సమాచారం అందించారు. ముగ్గురు పిల్లలు ఉదయం నుంచి కనపడకపోవడంతో తల్లిదండ్రుల ఎంఆర్‌ పల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. చివరకు వీరు పుత్తూరు పోలీసుల రక్షణలో ఉన్నారని తెలియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పుత్తూరులో వారికి అప్పగించారు. దీంతో చిన్నారుల అదృశ్యం కేసు సుఖాంతం అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని