logo

నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి... 5 ఎకరాల స్థలం

గాజువాక బీసీరోడ్డు సమీప 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్టీల్‌సిటీ ఐటీఐ ప్రాంగణంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పారిశ్రామిక

Published : 22 Jan 2022 02:48 IST

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక బీసీరోడ్డు సమీప 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్టీల్‌సిటీ ఐటీఐ ప్రాంగణంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఔత్సాహిక యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తయారు చేయడానికి మెరుగైన అవకాశాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం ఇటీవలే సర్వే చేసి స్థలాన్ని సేకరించినట్లు ఐటీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నగరంలోని ఆరిలోవలో మాత్రమే నైపుణ్యాభివృద్ధి కేంద్రం నడుస్తోంది. నూతన కేంద్రంలో ఐటీఐ, డిప్లమో, 7, 8 తరగతులు చదివిన వారికి స్వల్పకాలిక కోర్సులు అందుబాటులోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని