logo

సరుగుడు తోటలోకిపెద్దపులి

మండలంలో రెండు రోజులుగా సంచరిస్తున్న పులి జాడ తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట పాఠశాల వెనక నక్కి ఉందనే సమాచారంతో సోమవారం డీఆర్‌ఎఫ్‌ ధర్మరక్షిత్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖాధికారి సం

Published : 05 Jul 2022 04:28 IST


పులి పాదముద్రలు కొలుస్తూ..

కశింకోట, న్యూస్‌టుడే: మండలంలో రెండు రోజులుగా సంచరిస్తున్న పులి జాడ తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట పాఠశాల వెనక నక్కి ఉందనే సమాచారంతో సోమవారం డీఆర్‌ఎఫ్‌ ధర్మరక్షిత్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖాధికారి సంజీవరావు, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి అమర్‌నాథ్‌ ఆ ప్రాంతమంతా గాలించారు. దాని పాదముద్రలను చూసి పోలవరం కాలువ సమీపంలోని సరుగుడు తోటలోకి వెళ్లినట్లు గుర్తించారు. పులి సంచారంతో రాత్రివేళల్లో బయటకు రావడానికి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. తాళ్లపాలెం, బంగారయ్యపేట తదితర గ్రామాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు.

గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని