logo

ఉద్యోగుల ఓట్లు ఏకపక్షమే: సీఎం రమేశ్‌

పోస్టల్‌ బ్యాలెట్లో ఉద్యోగుల వేస్తున్న ఓట్లు ఏక పక్షమేనని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. పెందుర్తి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్ పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.

Published : 09 May 2024 04:06 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్లో ఉద్యోగుల వేస్తున్న ఓట్లు ఏక పక్షమేనని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. పెందుర్తి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్ పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్ కేంద్రంలో వైకాపా ఏజెంట్లు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉద్యోగుల ఓట్లు కూటమికే ఉన్నాయన్నారు. ఉద్యోగులతో పాటు వారి బంధువుల ఓట్లు కూడా కూటమికే వస్తాయని పేర్కొన్నారు. వైకాపా పార్టీ గాలికి కొట్టుకుపోతుందన్నారు. సీఎం జగన్‌ జూన్‌ 5న ఊరికి వెళ్తారా..? గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తారా..? తేల్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులు రెడ్డి నారాయణరావు, గొర్లె రామునాయుడు, గండ్రెడ్డి నగేశ్‌, శానాపతి సోమశేఖర్‌నాయుడు, బైలపూడి హరగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు