logo

ఆర్టీఏ దళారులపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

వరంగల్‌ రవాణాశాఖ కార్యాలయం పరిసరాల్లోని ఆన్‌లైన్‌ కేంద్రాలు, దళారుల దుకాణాలపై శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. బృందాలుగా ఏర్పడి దుకాణాల్లో సోదాలు జరిపారు. నకిలీ వాహన బీమా పత్రాలతో మోసపూరిత

Published : 01 Oct 2022 06:16 IST

రంగశాయిపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ రవాణాశాఖ కార్యాలయం పరిసరాల్లోని ఆన్‌లైన్‌ కేంద్రాలు, దళారుల దుకాణాలపై శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. బృందాలుగా ఏర్పడి దుకాణాల్లో సోదాలు జరిపారు. నకిలీ వాహన బీమా పత్రాలతో మోసపూరిత దరఖాస్తులు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అనుమానితులైన ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. గతంలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో నకిలీ బీమా పత్రాలు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు. తిరిగి అదే రీతిలో దందా కొనసాగిస్తున్నారనే సమాచారంతో మరోసారి సోదాలు చేపట్టారు. శుక్రవారం జరిగిన దాడుల కారణంగా కార్యాలయ పరిసరాల్లో దుకాణాలు మూతపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని