logo

ప్రథమంలో 24 ద్వితీయంలో 26

ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో వరంగల్‌ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది.

Published : 25 Apr 2024 04:36 IST

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో వరంగల్‌ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 10,196 (ప్రథమ, ద్వితీయ) మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 57శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2021-22లో రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 25వ స్థానంలో నిలవగా.. 2022-23లో ప్రథమంలో 27వ స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచింది. గత మూడేళ్ల ఫలితాల్లో బాలురతో పోల్చితే బాలికలదే పైచేయి. చారిత్రక ఓరుగల్లు జిల్లా చదువులో వెనుకబడటంపై విద్యావేత్తలు, మేధావుల నుంచి సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని