logo

అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం

రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్‌ డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు టీఎస్‌ఎంసీ సభ్యులు డాక్టర్‌ శేషుమాధవ్‌, డాక్టర్‌ నరేశ్‌కుమార్‌, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్‌వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు.

Updated : 26 Apr 2024 06:00 IST

కాటారంలో తనిఖీలు చేస్తున్న రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ బృందం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి : రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్‌ డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు టీఎస్‌ఎంసీ సభ్యులు డాక్టర్‌ శేషుమాధవ్‌, డాక్టర్‌ నరేశ్‌కుమార్‌, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్‌వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. అర్హతలేని వ్యక్తులు ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. భూపాలపల్లిలోని శ్రీసాయి నర్సింగ్‌ హోం వైద్యుడు సాంబయ్య, పూజిత ప్రథమ చికిత్స వైద్యుడు జనార్దన్‌, సుమలత ప్రథమ చికిత్స కేంద్ర వైద్యుడు భద్రయ్య, కాటారంలోని అరవింద్‌ ప్రథమ చికిత్స కేంద్రం వైద్యుడు శ్రీనివాసరావు, జనతా హాస్పిటల్‌ వైద్యుడు రాజు, రఫీ హాస్పిటల్‌లో వైద్యుడు రఫీలపై ఎన్‌ఎంసీ చట్టం 34, 54 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని టీఎస్‌ఎంసీ సభ్యులు  తెలిపారు. వీరంతా నకిలీ వైద్యులని అన్నారు. అలాగే కాటారంలోని బాలాజీ ఆసుపత్రి వైద్యుడు నిఖిల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య నభ్యసించి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్‌ చేయకుండా వైద్యం చేస్తున్నందుకు నోటీస్‌ ఇవ్వడంతో పాటు ఏపీఎంసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయా చికిత్సా కేంద్రాలను, మందుల దుకాణాలను మూసివేయాలని సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌రెడ్డి, తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వద్దిరాజు రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని