logo

బరి గీశారు.. గురి ఎవరిదో..!

‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ  క్రమంలో వరంగల్‌ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్‌ యూనిట్లు, మహబూబాబాద్‌ పరిధిలో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’

Published : 30 Apr 2024 06:57 IST

వరంగల్‌లో 42.. మహబూబాబాద్‌లో 23 మంది పోటీ

‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ  క్రమంలో వరంగల్‌ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్‌ యూనిట్లు, మహబూబాబాద్‌ పరిధిలో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’

లోక్‌సభ ఎన్నికల్లో నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది. వరంగల్‌లో 42, మహబూబాబాద్‌లో 23 మంది పోటీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. 25 వరకు సమర్పణకు అవకాశం కల్పించారు. 26న నామపత్రాల పరిశీలన అనంతరం అనర్హులను తొలగించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. వరంగల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు పూర్తిచేశారు. గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయస్థాయి పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులతో బరిలో కొనసాగనున్నారు.

 వరంగల్‌లో అభ్యర్థులకు గుర్తులను ప్రకటిస్తున్న రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య, చిత్రంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్‌ రణ్వీర్‌ చంద్‌

 వరంగల్‌ కలెక్టరేట్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఎవరో లెక్కతేలడంతో.. మంగళవారం నుంచి ప్రచారం  జోరందుకోనుంది.  మే 11 వరకు ఎండలతో పాటు నాయకుల పరస్పర మాటల యుద్ధాలతో రాజకీయ వేడీ రాజుకోనుంది. గుర్తింపు పొందిన ప్రాంతీయ, జాతీయస్థాయి పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులతో బరిలో దిగనున్నారు. ఎన్నికల బరిలో బీఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్‌ నుంచి కల్పన పంజా, మహబూబాబాద్‌ నుంచి కోనేటి సుజాత పోటీ చేస్తున్నారు. ×

నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు..

ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకే స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య తెలిపారు.  సోమవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్‌ రణ్వీర్‌ చంద్‌ సమక్షంలో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తించని, రిజిస్టర్‌ అవని పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రామాణికంగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు. ఒకే గుర్తును ప్రతిపాదించిన ఇద్దరు అభ్యర్థులకు లాటరీ విధానాన్ని అనుసరించి గుర్తులు ఇచ్చామన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను కేటాయించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్‌, ఏఆర్వోలు అశ్వినీ తానాజీ, రాధిక గుప్తా, పియూష్‌ కుమార్‌, డీఎస్‌ వెంకన్న, రోహిత్‌సింగ్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు